ఆంధ్రప్రదేశ్

andhra pradesh

lawyers_boycotting_court_duties

ETV Bharat / videos

లాయర్లు విధులను బహిష్కరించడంపై స్పందించిన హైకోర్టు - 14 బార్‌ అసోసియేషన్​లకు నోటీసులు - AP High Court News

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 10, 2023, 9:23 AM IST

High Court Responded on Lawyers Boycotting Court Duties:న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిల్‌పై హైకోర్టు స్పందించింది. న్యాయశాఖ ముఖ్యకార్యదర్శి, ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్, ఏపీ బార్‌ కౌన్సిల్‌ కార్యదర్శి, రాష్ట్రంలోని 14 బార్‌ అసోసియేషన్ల ప్రధాన కార్యదర్శులు, అధ్యక్షులకు నోటీసుల జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్, జస్టిస్‌ ఆర్‌ రఘునందన్‌రావుతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 

కోర్టు విధుల బహిష్కరించడానికి వీల్లేదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా రాష్ట్రంలోని వివిధ బార్‌ అసోసియేషన్లు విధులకు దూరంగా ఉండాలంటూ తీర్మానం చేయడాన్ని సవాలు చేస్తూ హైకోర్టు న్యాయవాది తాండవ యోగేశ్‌ హైకోర్టులో పిల్‌ వేశారు. విధుల బహిష్కరణ తీర్మానాలు కోర్టుధిక్కరణ కిందకు వస్తుందన్నారు. సంబంధిత బార్‌ అసోసియేషన్ల ఎగ్జిక్యూటివ్‌ బాడీలను పదవి నుంచి తొలగించాలని కోరారు. ఇటీవల ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయస్థానం ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది.

ABOUT THE AUTHOR

...view details