ఆంధ్రప్రదేశ్

andhra pradesh

high_court_orders_to_govt_on_trees_cutting

ETV Bharat / videos

High Court Orders to Govt on Trees Cutting: రాష్ట్రంలో చెట్లు నరికివేతపై స్పందించిన హైకోర్టు.. సంబంధిత శాఖలకు ఉత్తర్వులు జారీ - High Court verdict on cutting trees in AP

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 8, 2023, 10:47 AM IST

High Court Orders to Govt on Trees Cutting:రహదారుల విస్తరణలు, విద్యుత్ లైన్ల ఏర్పాటుకు అవరోధంగా ఉన్న చెట్లను కొట్టివేయకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వాటిని మరో చోట పునఃస్థాపన చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. చెట్లను వేరే చోట నాటేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. చెట్లు కొట్టివేత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని వ్యాఖ్యానించింది. చెట్లను కొట్టేసి.. ప్రత్యామ్నాయంగా మొక్కలు నాటినా జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడంతో సరిసమానం కాదని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని గుర్తుచేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని పేర్కొంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్ శాఖ, అటవీ శాఖ, ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శులు, ఏపీ సుందరీకరణ, పచ్చదనం కార్పొరేషన్ తదితరులకు నోటీసులు జారీచేసింది. విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఏవీ శేషసాయి, జస్టిన్ ఆర్. రఘునందనరావుతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. 

జాతీయ, రాష్ట్ర రహదారుల విస్తరణ, విద్యుత్ లైన్ల ఏర్పాటు కోసం అడ్డొస్తున్నాయన్న కారణంతో వృక్షాలను విచక్షణారహితంగా కొట్టివేయడాన్ని నిలువరించాలని.. వాటిని అక్కడి నుంచి తరలించి వేరే చోట పునఃస్థాపన చేసేలా ఆదేశాలు జారీచేయాలని కోరుతూ గుంటూరుకు చెందిన వైద్య విద్యార్థి అస్మద్ మహమ్మద్ షేక్ షా హైకోర్టులో పిల్ వేశారు. పిటిషనర్ తరపున న్యాయవాది బషీర్ అహ్మద్ వాదనలు వినిపించారు. చెట్లను కొట్టేయకుండా మరో ప్రాంతంలో నాటేందుకు ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉందన్నారు. హైదరాబాద్ మెట్రోరైల్వే నిర్మాణ సమయంలో అడ్డుగా ఉన్న వృక్షాలను తొలగించి ఇతర ప్రాంతాలలో నాటారని వివరించారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి కౌంటర్ వేయాలని ఆదేశాలిచ్చింది.

ABOUT THE AUTHOR

...view details