ఆంధ్రప్రదేశ్

andhra pradesh

High Court

ETV Bharat / videos

ఇసుక అక్రమ తవ్వకాలకు అనుమతి ఇవ్వబోం - వీవీ లక్ష్మీనారాయణ

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 6, 2023, 4:39 PM IST

High Court on sand irregularities in AP:రాష్ట్రంలో పలు చోట్ల ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయంటూ దండా నాగేంద్ర అనే వ్యక్తి దాఖలు చేసిన పిల్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. పిటీషనర్ తరపున న్యాయవాది వీవీ లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు. పిల్ ను అనుమతించాలని పిటీషనర్ న్యాయవాది లక్ష్మీనారాయణ కోరారు. ప్రభుత్వం తరపు అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. అక్రమ తవ్వకాలకు అనుమతి ఇవ్వబోమని ఏజీ న్యాయస్థానానికి తెలిపారు. పర్యావరణ అనుమతులు ఉంటేనే అనుమతిస్తామని ఏజీ కోర్టుకు తెలిపారు. అనుమతుల ఉల్లంఘనల పై ఇప్పటికే జాతీయ హరిత ట్రిబ్యునల్ లో విచారణ జరుగుతుందన్నారు. అడ్వకేట్ జనరల్ స్టేట్ మెంట్ ను రికార్డ్ చేసిన ధర్మాసనం, దండా నాగేంద్ర పిల్ ను డిస్పోజ్ చేసింది.  

కోర్టులో జరిగిన వాదనలపై దండా నాగేంద్ర తరఫున న్యాయవాది వీవీ లక్ష్మీనారాయణ స్పందించారు. గతంలో మైనింగ్ పర్మిషన్​లో అక్రమాలు జరిగాయని, ఇదే అంశంపై నేషనల్ జాతీయ హరిత ట్రిబ్యునల్ లో విచారణ కొనసాగుతుందని తెలిపారు. ఇసుక అక్రమ రవాణా కోసం నదికి అడ్డంగా మట్టితో రోడ్లు, బ్రిడ్జీలను ఏర్పాటు చేస్తున్నారని లక్ష్మీనారాయణ తెలిపారు. ఇసుక అక్రమ రవాణపై ఎన్​జీటీ ఆదేశాలను సైతం పట్టించుకోకుండా ప్రభుత్వ పెద్దలు అక్రమాలకు పాల్పడుతున్నారని వీవీ లక్ష్మీనారాయణ ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details