ఆంధ్రప్రదేశ్

andhra pradesh

High_Court_on_Capital_Amaravati_Farmers_Petition

ETV Bharat / videos

వారంలోగా తేల్చండి లేదంటే మేమే ఆర్డర్ పాస్ చేస్తాం : రాజధాని రైతుల పిటిషన్‌పై ఏపీ ప్రభుత్వానికి స్పష్టం చేసిన హైకోర్టు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 27, 2023, 7:11 PM IST

Updated : Nov 28, 2023, 6:28 AM IST

High Court on Capital Amaravati Farmers Petition: కౌలు చెల్లించాలంటూ రాజధాని అమరావతి రైతులు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. తమకు వార్షిక కౌలును ప్రభుత్వం చెల్లించాలని కోరుతూ చింతా రామ్మోహన్​తో పాటు మరికొందరు రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పిటిషన్​పై న్యాయస్థానం నేడు విచారణ జరిపింది. సీఆర్డీఏ కమిషనర్ ఇటీవల ఎన్నికల విధులు ముగించుకుని వచ్చారని.. మూడు వారాల సమయం కావాలని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టును కోరారు. 

దీనిపై స్పందించిన న్యాయస్థానం.. అడిషనల్ కమిషనర్ ఉన్నారని.. ఫైనాన్స్ సెక్రటరీ, మున్సిపల్ సెక్రటరీ వీటిపై నిర్ణయం తీసుకోవచ్చని తెలిపింది. కాబట్టి మూడు వారాల సమయం అవసరం లేదని అభిప్రాయపడిన న్యాయస్థానం..  వారంలోగా రిప్లై ఇవ్వాలని లేకుంటే తామే ఆర్డర్ పాస్ చేస్తామని స్పష్టం చేసింది. అదే విధంగా సమితి, సమాఖ్య దాఖలు చేసిన పిటిషన్లతో జత చేసి.. ఈ పిటిషన్​ను కూడా విచారించాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి హైకోర్టు వాయిదా వేసింది. 

Last Updated : Nov 28, 2023, 6:28 AM IST

ABOUT THE AUTHOR

...view details