High Court on Amaravati Tenant Farmers Petition: రాజధాని రైతుల కౌలు కేసు.. సీఆర్డీఏ, ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు - high court notices to government
High Court on Amaravati Tenant Farmers Petition: రాజధాని అమరావతి రైతులకు కౌలు చెల్లించకుండా వస్తున్న ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. రాజధాని రైతుల కౌలు చెల్లించే కేసులో సీఆర్డీయే, ప్రభుత్వానికి హైకోర్టు ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. తమకు వార్షిక కౌలు చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ అమరావతి రాజధాని సమీకరణ రైతు సమాఖ్య, రాజధాని రైతు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్పై న్యాయస్థానం విచారణ చేపట్టింది. రైతులకు కౌలు చెల్లించేందుకు జీవో ఇచ్చి ప్రభుత్వం కౌలు చెల్లించలేదని రైతుల తరపున సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధర్ వాదనలు వినిపించారు. ప్రతి ఏడాది మేలో కౌలు చెల్లించే వారని, ఈ ఏడాది నేటి వరకు కౌలు చెల్లించలేదని న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో వాదనలు విన్న న్యాయస్థానం సీఆర్డీయే, ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.