ఆంధ్రప్రదేశ్

andhra pradesh

high_court_impatient_ttd_officers

ETV Bharat / videos

అత్యంత ధనిక దేవస్థానం వద్ద పరిహారం చెల్లించడానికి సొమ్ములేదా? : టీటీడీ అధికారులపై హైకోర్టు అసహనం - హైకోర్టు తీవ్ర అసహనం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 30, 2023, 1:39 PM IST

High Court Impatient with TTD Officials for Delay of Compensation : తిరుమలలోని చిరుత దాడిలో మృతి చెందిన బాలిక కుటుంబానికి పెంచిన పరిహారం చెల్లింపులో జాప్యం చేసినందుకు టీటీడీ అధికారులపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అత్యంత ధనిక దేవస్థానం టీటీడీ వద్ద పరిహారం చెల్లించేందుకు సొమ్ము లేదా ? అని సూటిగా ప్రశ్నించింది. వారంలో బాధిత కుటుంబానికి పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

అలిపిరి నుంచి తిరుమల కాలిబాటలో వన్య ప్రాణుల దాడుల నుంచి భక్తులను రక్షించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారని ప్రశ్నించింది. వైల్డ్​లైఫ్ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా కమిటీ ఇచ్చిన నివేదికపై సృష్టత ఇవ్వాలని టీటీడీ అధికారులను ఆదేశించింది. అవసరమైన చోట కాలిమార్గంలో ఇనుప కంచె వేయవచ్చని, అండర్​పాస్, అప్పర్​పాస్​లు ఏర్పాటు చేయవచ్చని నివేదిక చెబుతోందంటూ.. పిటిషనర్ తరుపున వాదనలు విన్న హైకోర్టు.. భవిష్యత్తులో ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారో తెలపాలని టీటీడీ అధికారులను ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. 

ABOUT THE AUTHOR

...view details