High Court Angry on Electricity officials: 'తీర్పు వివరాలు తెలుసుకోవాల్సిన బాధ్యత లేదా?'.. విద్యుత్ అధికారులపై హైకోర్టు ఆగ్రహం - సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పు
A case of contempt of court: కోర్టు ధిక్కరణ కేసులో విద్యుత్ అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తీర్పు వివరాలు తెలుసుకోవాల్సిన బాధ్యత లేదా అని ఏపీఎస్‌పీడీసీఎల్ సీఎండీ సంతోష్ రావు, ట్రాన్స్ కో మాజీ సీఎండీ శ్రీధర్‌ను న్యాయస్థానం ప్రశ్నించింది. ఈ నెల 27వ తేదీలోగా రిజిస్ట్రార్ ముందు లొంగిపోవాలని ఇచ్చిన ఆదేశాలను ఎందుకు కట్టుబడలేదని గత విచారణలో హైకోర్టు ప్రశ్నించింది. బాధ్యతాయుతమైన అధికారులు కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను గౌరవించేది ఇలానేనా అంటూ కోర్టు వ్యాఖ్యానించింది. జులై 21వ తేదీన సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు సస్పెండ్ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. తదుపరి విచారణను న్యాయస్థానం నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఒప్పంద ఉద్యోగస్తులను రెగ్యులరైజ్ చేయాలని గతంలో ఇచ్చిన ఆదేశాలు విద్యుత్ శాఖ అధికారులు పాటించకపోవటంతో ఉద్యోగస్తులు కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేశారు. విచారించిన న్యాయస్థానం జులై 21న ఇద్దరు అధికారులకు నెల రోజుల జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధించింది. జులై 27 లోపు రిజిస్ట్రార్ ముందు లొంగిపోవాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలను పాటించకపోవటంతో గత విచారణలో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసి.. నేడు లొంగిపోవాలని ఆదేశించింది. ఈ రోజు అధికారులకు విధించిన శిక్షను సస్పెండ్ చేసింది.