High Court Adjourned Ex Minister Narayana Ring Road Case Hearing: మాజీ మంత్రి నారాయణ ఇన్నర్ రింగ్ రోడ్ కేసు.. విచారణ శుక్రవారానికి వాయిదా - Ex Minister Narayana Ring Road Case
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 4, 2023, 2:57 PM IST
High Court Adjourned Ex Minister Narayana Ring Road Case Hearing: మాజీ మంత్రి నారాయణ ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. నారాయణ పిటిషన్‌ను మరో బెంచ్‌కు బదిలీ చేయాలని న్యాయమూర్తి ఉత్తర్వులిచ్చారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో విచారణకు హాజరుకావాలంటూ.. నారాయణకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై నారాయణ హైకోర్టును ఆశ్రయించారు. ఆరోగ్య కారణాల రీత్యా విచారణకు గుంటూరు రాలేనని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇంటి వద్దే విచారించేలా సీఐడీని ఆదేశించాలని హైకోర్టును కోరారు. 65 ఏళ్లు పైబడిన వారి విషయంలో సుప్రీంకోర్టు నిబంధనలను నారాయణ ప్రస్తావించారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన ధర్మాసనం.. పిటిషన్‌ను మరో బెంచ్‌కు బదిలీ చేయాలని ఉత్తర్వులిస్తూ విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.
నారాయణకు నోటీసులు:ఈ రోజు విచారణకు హాజరు కావాలని ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మాజీ మంత్రి నారాయణకు సీఐడీ అధికారులు నోటీసులు అందించిన విషయం తెలిసిందే. లోకేశ్‌కు నోటీసులు అందించిన అధికారులు.. నారాయణకు కూడా అందించి.. ఇద్దరినీ కలిపి విచారించాలని సీఐడీ అధికారులు అనుకున్నారు.