Heroine Mehreen and Taman at Indrakiladri: ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న హీరోయిన్ మెహరీన్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ - Dussehra celebrations in Vijayawada
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 19, 2023, 8:57 PM IST
Heroine Mehreen Kaur Pirzada Visited Kanaka Durga Goddess on Indrakiladri:దసరా ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై మహా చండీ దేవి అలంకరణలో అమ్మ వారిని సినీ హీరోయిన్ మెహరీన్ కౌర్ పిర్జాదా దర్శించుకున్నారు. కనకదుర్గమ్మను దర్శించుకోవడం సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. దసరా సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడం ఇదే మొదటి సారన్నారు. ఇలా కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. సినిమాల్లో మరిన్ని అవకాశాలు రావాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. మెహరీన్‌ని చూసిన అభిమానులు ఒక్కసారిగా కేకలు వేశారు. అభిమానులకు అభివాదం చేస్తూ మెహరిన్ అమ్మ వారిని దర్శించుకుని వెళ్లిపోయారు.
Taman visited Kanaka Durga Goddess on Indrakiladri: మహా చండీ దేవి అలంకరణలో ఉన్న దుర్గమ్మవారిని సినీ సంగీత దర్శకుడు తమన్ దర్శించుకున్నారు. తమన్‌ని చూసిన అభిమానులు ఒక్కసారిగా కేకలు వేశారు. అభిమానులకు అభివాదం చేస్తూ తమన్ అమ్మ వారిని దర్శించుకుని వెళ్లిపోయారు..