ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Heroine_Kajal_Aggarwal_in_Chittoor

ETV Bharat / videos

Heroine Kajal Agarwal in Chittoor: "సత్యభామను నేనే".. చిత్తూరులో సినీనటి కాజల్ ​సందడి - Kajal Aggarwal Latest Movie Updates

By

Published : Aug 18, 2023, 7:27 PM IST

Heroine Kajal Agarwal in Chittoor: సినీనటి కాజల్ అగర్వాల్​ చిత్తూరులో సందడి చేసింది. నగరంలోని ఓ షాపింగ్​ మాల్​ ప్రారంభోత్సవానికి ఆమె రాగా.. పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకున్నారు. అభిమానుల కేరింతలు సందడితో షాపింగ్​ మాల్​ ప్రాంతమంతా ఉత్సహంతో నిండిపోయింది. చిత్తూరు నగరంలోని హైరోడ్డులోని నూతనంగా ఏర్పాటు చేసిన.. మాంగళ్య షాపింగ్​మాల్​ను సినీ నటి కాజల్​  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో ముచ్చటించారు. ఆమె ప్రస్తుతం నటిస్తున్న చిత్ర విశేషాలను, రాబోయే సినిమాల గురించి మీడియాతో పంచుకున్నారు. బాలయ్యతో కలిసి ఓ సినిమాలో నటిస్తున్నట్లు వివరించారు. అంతేకాకుండా పోలీసుగా లీడ్​రోల్​లో.. ఆమె ఓ చిత్రంలో నటించనున్నట్లు వివరించారు. ఆ సినిమాలో తన పాత్ర పేరు సత్యభామ అని వెల్లడించారు. ఈ మధ్య కాలంలో సినిమాలు ఎందుకు తగ్గాయని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. తన కుమారుడిని దృష్టిలో ఉంచుకుని సినిమాలలో నటించలేదని వివరించారు. ఆమెను చూడటానికి పెద్ద ఎత్తున్న అభిమానులు అక్కడికి చేరుకోవటంతో వారిని అదుపు చేయటానికి పోలీసులకు కష్టంగా మారింది.

ABOUT THE AUTHOR

...view details