కర్నూలులో మంచు మనోజ్ దంపతులు.. తాత ఆశీర్వాదం కోసం.. - wedding photos of manchu manoj
HERO MANCHU MANOJ AT KURNOOL : కర్నూలులో మంచు మోహన్‌బాబు తనయుడు, హీరో మంచు మనోజ్ కుమార్, ఆయన భార్య భూమా మౌనికా రెడ్డి సందడి చేశారు. మనోజ్, భూమా మౌనికా రెడ్డికి వివాహమైన సందర్భంగా.. మౌనికా రెడ్డి తాత, మాజీ మంత్రి సుబ్బారెడ్డిని కలిసేందుకు కర్నూలుకు వచ్చారు. వీరితో పాటు తెలంగాణ రాష్ట్ర తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా కర్నూలులో ఎస్వీ సుబ్బారెడ్డి ఇంట్లో అల్పాహారం చేశారు. అనంతరం కర్నూలు నుంచి ఆళ్లగడ్డకు పయనమయ్యారు.
హీరో మంచు మనోజ్, దివంగత నేత భూమా నాగిరెడ్డి రెండో కుమార్తె మౌనికా రెడ్డి వివాహబంధంతో ఒక్కటయ్యారు. మార్చి 4వ తేదీ శుక్రవారం రాత్రి కొద్ది మంది అతిథుల సమక్షంలో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
గతంలో మంచు మనోజ్‌కు ప్రణతి అనే యువతితో పెళ్లి జరిగిన కొంతకాలం తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో ఇరువురి అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. ఇకపోతే మౌనికకు కూడా అంతకుముందే పెళ్లి చేసుకుని.. డివోర్స్ తీసుకున్నారు. ఇక మనోజ్ తాజాగా 'వాట్ ది ఫిష్' అనే మూవీ చేస్తున్నట్లు తెలిపారు. వివాహం అనంతరం మొదటిసారి దంపతులుగా కలిసి కర్నూలుకు వచ్చారు.