ఆంధ్రప్రదేశ్

andhra pradesh

heavy-rain-in-tirumala-north-east-monsoon-effect

ETV Bharat / videos

తిరుమలలో భారీ వర్షం.. తీవ్ర ఇబ్బందులు పడుతున్న భక్తులు - వర్షంతో తడిసిన ముద్దయిన భక్తులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 6, 2023, 7:09 PM IST

Heavy Rain in Tirumala : ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తిరుమలలో భారీ వర్షం కురుస్తుంది. రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా ఉరుములు మెరుపులతో కురుస్తున్న వానలకు తిరుమల తడిసి ముద్దయింది. శ్రీవారి ఆలయ చుట్టుప్రక్కల రోడ్లన్నీ జలమయం అయ్యాయి. క్యూలైన్లలోకి వర్షం నీరు వచ్చి చేరింది. ఎటు చూసినా వర్షపు నీరు ఉండటంతో.. స్వామి దర్శనం కోసం వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నచోట నుంచి ఎటూ కదలలేక కొందరు వర్షంలో తడుస్తు ఉంటే.. మరికొందరు షెడ్లు, భవనాల కింద తలదాచుకుంటున్నారు. మరోవైపు చలి తీవ్రత కూడా బాగా పెరిగింది. 

వృద్థులు, చిన్నారుల అవస్థలు వర్ణనాతీతం. రోడ్లన్నీ జలమయం కావడంతో దుకాణాలన్నీ మూసివేయలసిన పరిస్థితి ఏర్పడింది. ఆగకుండా కురుస్తున్న వర్షం కారణంగా..వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఘాట్ రోడ్డుల్లో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని టీటీడీ బోర్డు తెలిపింది. భక్తులు వాహనాలను జాగ్రత్తగా నడపాలని సూచించింది. 

తిరుమలలో వాణిశ్రీ: తిరుమల శ్రీవారిని అలనాటి నటి వాణిశ్రీ దర్శించుకున్నారు. ఇవాళ వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details