Heat Waves in AP రాష్ట్రంలో మళ్లీ వేడిగాలులు.. పొడివాతావరణంతో స్వల్పంగా పెరగనున్న ఉష్ణోగ్రతలు! - AP will have hot weather in coming days
Heat Waves in AP: రాష్ట్రంలో ఇటీవల ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు రాష్ట్రమంతటా వాగులు వంకలు పొంగిపొర్లాయి.. లోతట్టు ప్రాంతాలలోని గ్రామాలను వరదలు మంచాయి.ఇప్పటికీ కొన్ని గ్రామాలలో వరదల ప్రభావం అలానే ఉంది.ఎంతో మంది రైతులు తీవ్ర నష్టాన్ని పొందారు. అయితే ఇప్పటి వరకు వర్షాలతో ఉన్న రాష్ట్రంలోని వాతావరణం ఇక నుంచి వేడిమి పరిస్థతులతో ఉండనుంది. ఇకనుంచి నైరుతీ రుతుపవనాల స్వల్ప విరామంతో రాష్ట్రంలో పొడి వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. రాగల రెండు మూడు రోజులల్లో రాష్ట్ర వ్యాప్తంగా వేడి, ఉక్కపోత పరిస్థితులు కొనసాగుతాయని భారత వాతావరణ విభాగం తెలియచేసింది. కోస్తాంధ్ర, రాయలసీమ, యానాంలలో 5, 6, 7 తేదీల్లో వేడిమి, ఉక్కపోత పరిస్థితులు ఉంటాయని అమరావతిలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న పొడివాతావరణం కారణంగా రాష్ట్రంలో స్వల్పంగా ఉష్ణోగ్రతలు పెరిగినట్టు తెలియచేసింది. మరోవైపు రాగల 5 రోజుల పాటు ఏపీ సహా దక్షిణ భారత్ అంతటా వర్షాభావ పరిస్థితులు ఉంటాయని ఐఎండీ తెలిపింది.