ఆంధ్రప్రదేశ్

andhra pradesh

hearing_on_bhaskar_reddy_interim_bail_petition

ETV Bharat / videos

Hearing on Bhaskar Reddy Interim Bail Petition: సీబీఐ కోర్టులో వైఎస్‌ భాస్కర్‌రెడ్డి మధ్యంతర బెయిల్ పిటిషన్..నేడు విచారణ - సీబీఐ కోర్టులో భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 15, 2023, 9:52 AM IST

Hearing on Bhaskar Reddy Interim Bail Petition in Viveka Murder Case in CBI Court :వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి మధ్యంతర బెయిల్ ఇవ్వొద్దని కోర్టును సీబీఐ కోరింది. భాస్కర్ రెడ్డికి బెయిల్ నిరాకరిస్తూ ఈ నెల 4న తెలంగాణ హైకోర్టు తీర్పును ఇచ్చింది. దీంతో భాస్కర్ రెడ్డి సీబీఐ కోర్టులో మరో పిటిషన్ వేశారు. అనారోగ్య సమస్యల దృష్ట్యా 15 రోజులు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరారు. భాస్కర్ రెడ్డి మధ్యంతర బెయిల్ పిటిషన్​ను కొట్టి వేయాలని కోరుతూ సీబీఐ కౌంటరు దాఖలు చేసింది. వైఎస్ భాస్కర్ రెడ్డి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సన్నిహిత బంధువని.. బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని.. ఇటీవల హైకోర్టులో బెయిల్ పిటిషన్​పై సీబీఐ గట్టిగా వ్యతిరేకించింది. భాస్కర్ రెడ్డి మధ్యంతర బెయిల్ పిటిషన్​పై ఇవాళ సీబీఐ కోర్టులో విచారణ జరగనుంది. 

ABOUT THE AUTHOR

...view details