ఆంధ్రప్రదేశ్

andhra pradesh

HC_on_Margadarsi

ETV Bharat / videos

HC on Margadarsi : మార్గదర్శిపై ప్రభుత్వ అప్పీళ్లను కొట్టివేసిన ఏపీ హైకోర్టు - Supreme Court on Margadarsi chit fund case

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 21, 2023, 12:31 PM IST

HC on Margadarsi :మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది. మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థకు చెందిన 3 బ్రాంచీల బ్యాంకు ఖాతాల నిర్వహణకు వీలు కల్పిస్తూ.. హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, పోలీసులు దాఖలు చేసిన అప్పీళ్లను హైకోర్టు ధర్మాసనం కొట్టేసింది (AP High Court Dismissed the Government Appeal on Margadarsi Chit Fund). ఈ అప్పీ ళ్లకు విచారణార్హత లేదని తేల్చి చెప్పింది. క్రిమినల్ లా నిబంధనలను అనుసరించి సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినందున వాటిపై అప్పీలు చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. సింగిల్ జడ్జి వద్ద ఉన్న ప్రధాన వ్యాజ్యాల్లో కౌంటరు దాఖలు చేసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి, పోలీసులకు సూచించింది. సింగిల్ జడ్జి సాధ్యం అయినంత త్వరగా ప్రధాన వ్యాజ్యాలపై విచారణ జరుపుతారని ఆశిస్తున్నట్లు పేర్కొంది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ యూ దుర్గాప్రసాద రావు, జస్టిస్ ఏవీ రవీంద్ర బాబుతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు కీలక తీర్పు ఇచ్చింది. 

ABOUT THE AUTHOR

...view details