ఆంధ్రప్రదేశ్

andhra pradesh

HC_on_Amaravati_farmers_Tenancy_Petition

ETV Bharat / videos

అమరావతి రైతులకు హైకోర్టులో ఊరట, విచారణకు అనుమతించిన హైకోర్టు- కానీ? - అమరావతి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 8, 2023, 1:28 PM IST

HC on Amaravati farmers Tenancy Petition: రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం వార్షిక కౌలు చెల్లించకపోవడాన్ని ప్రశ్నిస్తూ దాఖలైన వ్యాజ్యానికి విచారణార్హత ఉందని హైకోర్టు తేల్చిచెప్పింది. రెండు రైతు సంఘాలు దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు, సంఘాల్లోని రైతులు అందరూ కోర్టు ఫీజు చెల్లించాలని ఆదేశించింది. 10 రోజుల్లో కోర్టు ఫీజు చెల్లించిన తర్వాత పిటిషన్‌పై విచారణ జరుపుతామని తెలిపింది. రైతు సంఘాలు వ్యాజ్యం దాఖలు చేయడంపై ప్రభుత్వం, సీఆర్​డీఏ తరఫు న్యాయవాది అభ్యంతరం లేవనెత్తారు. ఈ వ్యాజ్యానికి విచారణ అర్హత లేదని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. రైతుల తరఫున సీనియర్‌ న్యాయవాది ఉన్నం మురళీధరరావు ప్రభుత్వ వాదనను వ్యతిరేకించారు. సాంకేతిక కారణాలు సాకుగా చూపుతూ వ్యాజ్యానికి విచారణ అర్హత లేదనడం సరికాదన్నారు. 

AP High Court Accept Hearing on Petition of Amaravati Farmers: ఆర్థిక స్థోమత, చట్టాలపై అవగాహన లేని వారి తరఫున దాఖలైన వ్యాజ్యాలను విస్తృత కోణంలో చూడాలని జస్టిస్‌ కృష్ణ అయ్యర్‌ తీర్పు ఇచ్చారని గుర్తుచేశారు. తీర్పు ప్రతులను కోర్టుకు అందజేశారు. మే నెలలో ఇవ్వాల్సిన కౌలును రైతులకు చెల్లించకుండా ప్రభుత్వం కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తోందన్నారు. 28 వేల 720 మంది రైతులు రాజధాని కోసం 34 వేల 396 ఎకరాల భూమిని ఇచ్చారన్నారు. వారిలో ఎకరాలోపు భూమి ఇచ్చిన వారు 20,176 మంది ఉన్నారన్నారు. ఎకరా నుంచి 2 ఎకరాల లోపు భూములిచ్చిన రైతులు 4,217 మంది ఉన్నారన్నారు. కౌలు చెల్లించకపోవడంతో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని సీనియర్‌ న్యాయవాది ఉన్నం మురళీధరరావు కోర్టు దృష్టికి తెచ్చారు. వాదనలు విన్న న్యాయస్థానం విచారణార్హతపై తీర్పును ఇటీవల వాయిదా వేసింది. గురువారం వ్యాజ్యాన్ని విచారణకు అనుమతిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

ABOUT THE AUTHOR

...view details