ఎంపీ రఘురామ ఇంప్లీడ్ పిటిషన్ విచారణ - 3 వారాలకు వాయిదా వేసిన హైకోర్టు - ఏపీ రాజకీయ వార్తలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 8, 2023, 11:26 AM IST
|Updated : Nov 8, 2023, 5:29 PM IST
HC Hearing Mp Raghuramaraju Petition: వైసీపీ రెబల్ ఎంపీ రఘురామరాజు ఇంప్లీడ్ పిటిషన్‌పై విచారణను హైకోర్టు 3 వారాలకు వాయిదా వేసింది. ఇంప్లీడ్ పిటిషన్‌పై ఉమేష్ చంద్ర, నర్రా శ్రీనివాసరావు వాదనలు వినిపించారు. కేసు కోర్టులో విచారణలో ఉండగా ఏఏజీ, సీఐడీ చీఫ్ సివిల్ కండక్ట్ రూల్స్‌కు వ్యతిరేకంగా ప్రెస్‌మీట్లు పెట్టారని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రెస్‌మీట్ వివరాలను ఆంగ్లంలోకి మార్చి ఇవ్వాలని పిటిషనర్‌ను కోరిన హైకోర్టు.. ఇంప్లీడ్ పిటిషన్‌పై తదుపరి వాయిదాలో నిర్ణయిస్తామని పేర్కొన్నారు.
టీడీపీ చంద్రబాబుపై నమోదు చేసిన స్కిల్ కేసు వివరాలను వెల్లడించేందుకు సీఐడీ చీఫ్ సంజయ్, అదనపు ఏజీ పొన్నవోలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి మీడియా సమావేశాలు నిర్వహించారంటూ దాఖలైన పిల్‌లో తనను ప్రతివాదిగా అవకాశం ఇవ్వాలని ఎంపీ రఘురామ హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. వారిద్దరూ నియామక నిబంధనల పరిధి దాటి వ్యవహరించారని.. స్కిల్ కేసుకు చెందిన దస్త్రాలు, దర్యాప్తునకు సంబంధించిన వివరాలను బహిర్గతం చేశారని వెల్లడించారు.
Mp Raghuramaraju Petition in HC: కేంద్ర సివిల్ సర్వీసెస్ ప్రవర్తన నిబంధనల ప్రకారం నేరానికి సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించడంపై నిషేధం ఉందని తెలిపారు. దానిని ఉల్లంఘించి, పక్షపాత ధోరణితో వారిద్దరూ మీడియాతో మాట్లాడారన్నారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని.. ఏపీ యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ క్యాంపెయిన్ సంస్థ అధ్యక్షుడు ఎన్.సత్యనారాయణ దాఖలు చేసిన వ్యాజ్యంలో తనను ప్రతివాదిగా చేర్చుకుని వాదనలు వినిపించేందుకు అనుమతివ్వాలని ఇంప్లీడ్ పిటిషన్‌లో కోరారు.