Guntur Youth Got Job In NASA : నాసాలో ఉద్యోగం సాధించిన గుంటూరు యువకుడు.. - అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం
Harshavardhan got a job in NASA : అమెరికా అంతరిక్ష సంస్థ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న నాసాలో గుంటూరుకు చెందిన యువకుడు హర్షవర్ధన్‌రెడ్డి ఉద్యోగం సాధించి ఔరా అనిపించారు... నగరంలోని ఏటుకూరుకు చెందిన నర్రావుల ఈశ్వరరెడ్డి, శివపార్వతి దంపతులకు ఇద్దరు కుమారులు. ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తూ పిల్లలను ఉన్నత చదువులు చదివించారు. వీరిలో పెద్దకుమారుడు హర్షవర్ధన్‌రెడ్డి మొదటి నుంచి చదువులో చురుకుగా ఉండేవారు. I.I.T గౌహతిలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తిచేశారు. గుజరాత్‌లోని రిలయన్స్ సంస్థలో కొన్నాళ్లు ఉద్యోగం చేశారు. చదువుకునేందుకు ఆర్థికంగా ఎలాంటి ఆటంకం లేకపోవటంతో హర్షవర్థన్‌రెడ్డి కాలిఫోర్నియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యూనివర్శిటీలో పీహెచ్‌డీ చేసేందుకు దరఖాస్తు చేయగా సీటు వచ్చింది. పీహెచ్‌డీ చేస్తున్న సమయంలోనే నాసా J.P.L లో ఉద్యోగానికి కి ఎంపికయ్యారు. ఈనెల 10న హర్షవర్థన్‌రెడ్డి నాసాలో J.P.L లో బాధ్యతలు చేపట్టారు. తమ కుమారుడు ఇంతటి ఘనత సాధించడంపై ఈశ్వరరెడ్డి, శివపార్వతి దంపతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.. భారతదేశం పేరు ప్రతిష్టలను మరింత పెంచేందుకు నావంతు కృషి చేస్తానని హర్షవర్ధన్‌రెడ్డి తెలిపారు.