ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Harirama_Jogaiah_on_TDP_Janasena_Joint_Manifesto

ETV Bharat / videos

టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన - హరిరామ జోగయ్య కీలక సూచనలు - tdp janasena news

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 10, 2023, 3:24 PM IST

Harirama Jogaiah on TDP-Janasena Joint Manifesto: తెలుగుదేశం-జనసేన పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనకు సంబంధించి.. కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు, మాజీ ఎంపీ హరిరామ జోగయ్య పలు కీలక సూచనలు, సలహాలు చేశారు. పీపుల్స్‌ మేనిఫెస్టో పేరుతో 75 వేల కోట్ల రూపాయల అంచనాతో.. 47 సంక్షేమ పథకాలు ప్రతిపాదించామని వెల్లడించారు. పీపుల్స్ మేనిఫెస్టోను రూపొందించి.. జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌కు అందజేశామన్నారు. తెలంగాణ ఎన్నికల అనంతరం తెలుగుదేశం-జనసేన కూటమిలో బీజేపీ చేరే అవకాశం ఉందని హరిరామ జోగయ్య వెల్లడించారు.

Harirama Jogaiah Comments: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ ఎంపీ హరిరామ జోగయ్య పీపుల్స్ మేనిఫెస్టో బుక్‌లెట్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..''కాపు సంక్షేమ సేన ఆధ్వర్యంలో 20 మంది కమిటీ సభ్యులతో పీపుల్స్ మేనిఫెస్టోను రూపొందించాం. ఆ మేనిఫెస్టోను జనసేన నేత నాదెండ్ల మనోహర్‌కు అందజేశాం. తద్వారా పవన్ కల్యాణ్‌కు మా సూచనలు తెలియజేయాలని కోరాం. మేనిఫెస్టోలో రూ.75 వేల కోట్ల రూపాయల అంచనాతో 47 సంక్షేమ పథకాలను ప్రతిపాదించాం. ప్రజలకు అవసరమైన, ముఖ్యమైన పథకాలను మాత్రమే అందులో పొందుపరిచాం. రాష్ట్రంలో రాక్షస, అరాచకమైన జగన్ పాలన కొనసాగుతుంది'' అని ఆయన అన్నారు.

ABOUT THE AUTHOR

...view details