ఆంధ్రప్రదేశ్

andhra pradesh

హజ్ యాత్రకు భారీగా తరలివెళ్తున్న ముస్లింలు

ETV Bharat / videos

hajj yatra 2023: గన్నవరం ఎయిర్​పోర్ట్​ నుంచి హజ్​యాత్ర ప్రారంభం .. తరలివెళ్తున్న యాత్రికులు - గన్నవరం ఎయిర్​పోర్ట్ లేటెస్ట్ న్యూస్

By

Published : Jun 7, 2023, 11:31 AM IST

Hajj Yatra Started From Gannavaram Airport: కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి ముస్లిం సోదరులు హజ్ యాత్రకు బయలుదేరి వెళ్లారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ఉదయం 9గంటలకు ఏస్ జి 5007 విమానం ప్రారంభమైంది. 170 మంది ప్రయాణికులతో నేరుగా విమానం జెడ్డాకు చేరుకోనుంది. 41 రోజుల పవిత్ర హజ్ యాత్రను ముగించుకుని ముస్లింలు జులై 17వ తేదీన తిరిగి రాష్ట్రానికి రానున్నారు. విజయవాడలోనే ఎంబారికేషన్ పాయింట్​కు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేసింది. అన్ని జిల్లాల నుంచి యాత్రికులను విజయవాడ తీసుకొచ్చేందుకు వాల్వో బస్సులు ఏర్పాటు చేశారు. హజ్ యాత్రికులపై ఛార్జీల అదనపు భారం పడకుండా అండగా నిలిచిన సీఎం వైఎస్ జగన్​మోహన్​రెడ్డికి ముస్లింలు కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్, బెంగళూరుతో పోలిస్తే విజయవాడ నుంచి హజ్ యాత్రకు వెళ్లే 1,813 మందిపై తలో 83 వేల రూపాయల అదనపు భారం పడనుండగా.. సీఎం జగన్ దృష్టికి దాన్ని తీసుకుని వెళ్లిన వెంటనే అదనపు భారాన్ని ప్రభుత్వమే భరించేలా నిర్ణయం తీసుకున్నారని మంత్రి అంజాద్ బాషా తెలిపారు. హజ్​యాత్రకు వెళ్లే వారి కోసం ప్రభుత్వం 14.51 కోట్ల రూపాయలను విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం హజ్ యాత్రికులకు బస, భోజనం, రవాణా సదుపాయాలు కల్పించడంపై ముస్లింలు హర్షం వ్యక్తం చేసారు.

ABOUT THE AUTHOR

...view details