GV Reddy on Viveka case సునీత వాంగ్మూలంతో టీడీపీపై.. జగన్ కుట్ర బహిర్గతం: జీవీ రెడ్డి - AP Latest News
GV Reddy comments on Viveka murder case: వివేకా హత్య కేసులో సునీత వాంగ్మూలంతో తెలుగుదేశం పార్టీపై.. జగన్ కుట్ర బహిర్గతం అయిందని టీడీపీ నేత జీవీ రెడ్డి తెలిపారు. విచారణలో సీబీఐ చేతులెత్తేసిందా అని నిలదీశారు. సీబీఐ ఛార్జ్ షీట్ అబద్ధమైతే, నాలుగేళ్లు అధికారంలోఉండి జగన్ రెడ్డి ఎందుకు నిజాలు కనిపెట్టలేకపోయాడని ప్రశ్నించారు. సీబీఐ ఛార్జ్ షీట్ అబద్ధమైతే అజయ్ కల్లం, కృష్ణమోహన్ రెడ్డి వాంగ్మూలాలు అబద్ధమేనా అని జీవీ రెడ్డి ధ్వజమెత్తారు. ఐఏఎస్ అధికారిగా ఉండి అజయ్ కల్లం జగన్ ప్రలోభాలకు లొంగి, హత్యకేసు వివరాలు దాచడం సిగ్గుచేడని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీగా పనిచేసిన వ్యక్తి, సలహాదారు పదవి కోసం వ్యక్తిత్వం చంపుకొని ఇంతకు దిగజారాలా అని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం వచ్చాక తొమ్మిది నెలలు సిట్ వేశారు.. కాని అప్పుడు ఎందుకు తేల్చలేకపోయారు మీ ప్రభుత్వంమే కదా అధికారంలో ఉన్నది అని ప్రశ్నించారు. ఈ కేసును పక్క వారి మీదికి ఎలా వెయ్యాలి అని ఎన్నో కుట్రలు పన్నారు అని విమర్శించారు.