Gurukula Supervisors Agitation: విజయవాడలో గురుకుల పాఠశాలల సూపర్వైజర్ల ధర్నా - ఏపీ గురుకుల ఉద్యోగుల తొలగింపుపై ఆందోళన
Gurukula Schools Supervisors Agitation: గురుకుల పాఠశాలలో పని చేస్తున్న సూపర్వైజర్లను తొలగిస్తూ గురుకుల పాఠశాలల సెక్రటరీ విడుదల ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని.. గురుకుల పాఠశాలల సూపర్వైజర్ల సంఘం ఆధ్వర్యంలో విజయవాడలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. స్థానికంగా ఉన్న ధర్నా చౌక్ వద్ద చేపట్టిన ఈ కార్యక్రమంలో.. సుపర్వైజర్లు పాల్గొన్నారు. తక్షణమే వారిని విధుల్లోకి తీసుకోవాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గురుకుల పాఠశాల సూపర్ వైజర్లను ఆప్కాస్లోకి వీలినం చేయాలని కోరారు. వీలినం చేస్తారని ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నామని తెలిపారు. ఒక్క సంతకంతో తమ కుటుంబాలను రోడ్డుపై పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీం తీర్పు మేరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. వారికి క్యాజువల్ లీవ్స్, మెడికల్ లీవ్స్ వంటి సదుపాయాలు కల్పించాలన్నారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని.. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.