ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Guntur_People_Fire_on_YCP_MLA

ETV Bharat / videos

Guntur People Fire on YCP MLA: 'ఎన్నికల హామీ ఎందుకు మర్చిపోయారు..?' వైసీపీ ఎమ్మెల్యేకు నిరసన సెగ.. దాచినా దాగని వీడియో - గుంటూరు లోకల్​ వార్తలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 14, 2023, 1:18 PM IST

Guntur People Fire on YCP MLA: నగరంలో భూగర్భ డ్రైనేజీ పనులు ఆగిపోవటం పై గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫాను ప్రజలు నిలదీశారు. పాత గుంటూరులోని 12వ డివిజన్లో ఎమ్మెల్యే ముస్తఫా పర్యటించారు. ఈ సందర్భంగా ముఫ్తీ వీధి వద్దకు ఆయన రాగానే తమ ప్రాంతంలో మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఎమ్మెల్యేకి ఫిర్యాదు చేశారు. వైయస్సార్​ కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.60 లక్షల వ్యయంతో మురుగు కాలువలు, కల్వర్టులు నిర్మిస్తామని ఎన్నికలప్పుడు చెప్పిన మాటలను గుర్తుచేశారు. 

హామీ ఇచ్చినా పనులు ఎందుకు చేయటం లేదని ఎమ్మెల్యేని స్థానికులు ప్రశ్నించారు. మీ బంధువులే ఈ పనులను చేసేందుకు కాంట్రాక్ట్ తీసుకున్నా.. ఎందుకు చేయటం లేదంటూ ముస్తఫా పై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడే ఉన్న ఎమ్మెల్యే ముస్తఫా అనుచరులు వారిని పక్కకు తీసుకెళ్లారు. ఫొటోలు, వీడియోలు తీయొద్దని స్థానికులకు హుకూం జారీ చేశారు. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనకు సంబంధించి వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది.

ABOUT THE AUTHOR

...view details