Guntur Municipal Corporation Officials Blocked TDP Flexis Arrangements: లోకేశ్ యువగళం పాదయాత్ర.. అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న నగరపాలక సంస్థ అధికారులు - గుంటూరులో టీడీపీ ఫ్లెక్సీలను అడ్డుకున్న అధికారులు
Guntur Municipal Corporation Officials Blocked TDP Flexis Arrangements: రెండు రోజుల్లో గుంటూరు జిల్లా మంగళగిరిలో లోకేశ్ పాదయాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో నగరపాలక సంస్థ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలు, బ్యానర్లు, కౌటౌట్లను అధికారులు అడ్డుకున్నారు. వీటి ఏర్పాటుకు కార్పొరేషన్ నుంచి అనుమతులు లేవని వాటని తొలగించాలని.. టీడీపీ నేతలతో నగరపాలక సంస్థ అధికారులు వాగ్వాదానికి దిగారు. నగరపాలక సంస్థ పరిధిలో చాలా ఫ్లెక్సీలున్నాయని.. వాటికి లేని అడ్డంకులు లోకేశ్ ఫ్లెక్సీలకే ఎందుకని అధికారులను టీడీపీ నేతలు ప్రశ్నించారు. ఫ్లెక్సీల ఏర్పాటు కోసం.. ఇదివరకే దరఖాస్తులు చేసుకున్నట్లు అధికారులకు టీడీపీ నేతలు వివరించారు. అయినప్పటికీ అధికారులు వినలేదని టీడీపీ నాయకులు వాపోయారు. ప్లెక్సీలను తొలగించాల్సిందేనని పట్టుబట్టారు. అదే సమయంలో టీడీపీ శ్రేణులు అక్కడికి భారీగా చేరుకోవటంతో అధికారులు వెనుదిరిగినట్లు వారు వివరించారు. ప్రస్తుతం లోకేశ్ పాదయాత్ర తాడికొండ నియోజకవర్గంలో కొనసాగుతోంది. మరో రెండు రోజుల్లో మంగళగిరి నియోజకవర్గంలో కొనసాగనుంది. ఇందులో భాగంగా లోకేశ్ పాదయాత్రకు స్వాగతం పలికేందుకుకు టీడీపీ శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నాయి.