ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Guntur Medical College 1978 Batch Reunion

ETV Bharat / videos

Guntur Medical College 1978 Batch Reunion: 45ఏళ్ల తర్వాత కలిశారు... సాగర తీరాన వైద్య విద్యార్థులు ఏం చేశారంటే..! - AP latest News

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 15, 2023, 1:25 PM IST

Guntur Medical College 1978 Batch Reunion in Visakha :"ఆనాటి ఆ స్నేహం.. ఆనంద గీతం" అంటూ వైద్యులు చిన్నపిల్లల్లా మారిపోయారు. 45 ఏళ్ల క్రితంజ్ఞాపకాల్లోకి వెళ్లిపోయి.. అప్పుడు చేసిన అల్లరి, కొంటె పనులు, సరదాలు గుర్తు తెచ్చుకుని సందడి చేస్తూ ఫిదా అయ్యారు. వీరంతా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ విదేశాల్లో వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డ వైద్యులు కావడం విశేషం. 1978 గుంటూరు మెడికల్ కాలేజీ వైద్య విద్యార్థులు 45 ఏళ్ల తర్వాత మళ్లీ కలయిక కోసం (Old Students Reunion in Visakha) విశాఖ సమీపంలోని సన్ రే రిసార్ట్స్​లో మూడు రోజుల పాటు ఆనందంగా గడిపారు. ఐదేళ్ల క్రితం 40 ఏళ్ల రీ యూనియన్ చేసిన వీరు తాజాగా ఈ రకంగా కలియడం పట్ల ఆసక్తి ఆనందం వ్యక్తం చేశారు. సాగర తీరంలో ఉల్లాసంగా గడిపారు.

ప్రముఖ సినీ గేయ రచయితలు భువనచంద్ర, అనంత శ్రీరామ్, అమెరికాలో స్థిరపడిన తెలుగు గాయని శారదను ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు.  వారు 1978 నాటి పాత స్నేహ మధుర గీతాలను ఆలపిస్తుంటే ఈ వైద్యులంతా మైమరిచిపోయారు. వారే పలు స్కిట్లు ఇతర డాన్సులు వంటి వాటిలో ఉత్సాహంగా పాల్గొన్నారు. సెల్ఫీలతో సందడి చేశారు. తమ మధుర జ్ఞాపకాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details