ఆంధ్రప్రదేశ్

andhra pradesh

guntur_channel_issue_in_pedanandipadu

ETV Bharat / videos

'గుంటూరు ఛానెల్ పొడిగింపుపై జగన్ మాట తప్పారు' : రైతు సంఘాల ఆగ్రహం, 20న ధర్నా - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 9, 2023, 1:32 PM IST

Guntur Channel Issue in Pedanandipadu : 'గుంటూరు ఛానెల్' పొడిగింపుపై జగన్ మాట తప్పారని రైతు సంఘం నాయకులు మండిపడ్డారు. గుంటూరు ఛానెల్‌పై ప్రభుత్వం మోసాలను వివరిస్తూ పెదనందిపాడులో నల్లమడ రైతు సంఘ నాయకులు సమావేశం నిర్వహించారు. స్థానిక నేతలు సైతం రైతు సమస్యలను విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగు, సాగు నీరు కూడా ఇవ్వని ప్రభుత్వం ఎందుకని ప్రశ్నించారు. దాదాపు 85 సంవత్సరాల నుంచి ఈ ప్రాంత వాసులు సాగు, తాగు నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారని  ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 20వ తేదీన పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని తెలిపారు. 

Farmer Union Leaders Meeting In Guntur : ఈ సమావేశంలో నల్లమడ రైతు సంఘం నేత రాజమోహన్ రావు మాట్లాడుతూ... సీఎంను కలిసి మా సమస్యను చెప్పుకుంటామని అధికారులను అడిగితే కనీసం కలిసే అవకాశం ఇవ్వకపోవడం అన్యాయం అన్నారు. ఇదే నియోజక వర్గంలో జరిగిన అయిదు బహిరంగ సభల్లో పాల్గొని గుంటూరు ఛానల్ ఇప్పిస్తామన్న సీఎం జగన్​కు తన మాటను గుర్తు చేస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details