CI Jaya Kumar in ACB Raids: సీఎంకు వ్యతిరేకంగా స్టిక్కర్లు.. ఏసీబీ వలలో సీఐ - ఏసీబీ అడిషనల్ ఎస్పీ స్నేహిత వీడియోలు
ACB Officials Caught CI Jaya Kumar: కృష్ణాజిల్లా గుడివాడ రూరల్ పోలీస్ సర్కిల్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రూరల్ సీఐ జయ కుమార్ రూ. 70 వేల లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణాజిల్లా గుడివాడలో సీఎం జగన్ పర్యటన సందర్భంగా.. ఇమేజ్ డిజిటల్స్ అనే సంస్థకు గో బ్యాక్ జగన్, దళిత ద్రోహి సీఎం స్టిక్కర్ల కోసం ఆర్డర్స్ వచ్చాయి. ఆ సంస్థకు పార్టీలతో సంబంధం లేకపోయినా.. తన వ్యాపారంలో భాగంగా సీఎం జగన్‌కు వ్యతిరేకంగా ఇమేజ్ డిజిటల్స్ స్టిక్కర్ల ముద్రించింది. ఈ నేపథ్యంలో సీఐ నుంచి వేధింపులు మొదలయ్యాయి. సీఐ తీరుతో విసిగిపోయిన ఇమేజ్ డిజిటల్స్ మేనేజర్ ఏసీబీని ఆశ్రయించాడు. సీఐ వేధింపులకు పాల్పడుతున్నారని సంస్థ మేనేజర్ కిరణ్ ఏసీబికి ఫిర్యాదు చేశారు. సీఐ జయ కుమార్ రూ. 70 వేలు లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అడిషనల్ ఎస్పీ స్నేహిత ఆధ్వర్యంలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.