ఆంధ్రప్రదేశ్

andhra pradesh

cooperative_officer_suspended

ETV Bharat / videos

గుడివాడ డివిజనల్ కోఆపరేటివ్ ఆఫీసర్ సస్పెండ్ - ఎందుకంటే? - Krishna important news

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 29, 2023, 1:59 PM IST

Gudivada Divisional Cooperative Officer Suspended: ఆంధ్రప్రదేశ్‌లో కొంతమంది అధికారులు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల అండదండలతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ, అవినీతికి పాల్పడుతున్న సంఘటనలు హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. తాజాగా అవినీతి ఆరోపణలు, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తోన్న ఓ అధికారిని సస్పెండ్ చేస్తూ కో-ఆపరేటివ్ కమిషనర్ బాబు ఉత్తర్వులు జారీ చేసిన సంఘటన కృష్ణా జిల్లా గుడివాడలో సంచలనంగా మారింది. టార్గెట్లు పెట్టి మరీ, పీఏసీఎస్‌ల నుంచి మామూళ్లు వసూలు చేస్తున్నట్లు ఆమెపై ఆరోపణలు రావడంతో విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

జరిగిన సంఘటన ఇది:కృష్ణా జిల్లా గుడివాడ డివిజనల్ కో-ఆపరేటివ్ ఆఫీసర్‌గా విధులు నిర్వరిస్తున్న విజయలక్ష్మి, అధికార పార్టీ నేతల అండదండలతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ, టార్గెట్లు పెట్టి మరీ పీఏసీఎస్‌ల నుంచి మామూళ్లు వసూలు చేస్తున్నట్లు ఆమెపై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. గతంలో విజయలక్ష్మి వ్యవహార శైలిపై పలువురు అధికారులు సైతం పై అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో విజయలక్ష్మిని సస్పెండ్ చేస్తూ కో-ఆపరేటివ్ కమిషనర్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. అవినీతి ఆరోపణలు, విధుల్లో నిర్లక్ష్యంపై విజయలక్ష్మిని సస్పెండ్ చేస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details