ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Cycle_ride_under_the_GCC

ETV Bharat / videos

Gudivada Cycling Club Awareness Program: గుడివాడ సైక్లింగ్ క్లబ్ ఆధ్వర్యంలో 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు - AP Latest News

By

Published : Aug 15, 2023, 2:55 PM IST

Gudivada Cycling Club Awareness Program: కృష్ణా జిల్లాలో గుడివాడ సైక్లింగ్ క్లబ్ ఆధ్వర్యంలో 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ మాగంటి శ్రీనివాస్ 76 కిలోమీటర్ల సైకిల్ రైడ్‌ను ప్రారంభించారు. గుడివాడ నెహ్రూ సెంటర్ నుంచి ప్రారంభమైన సైకిల్ రైడ్ నియోజకవర్గం మొత్తం 76 కిలోమీటర్లు కొనసాగుతుందని శ్రీనివాసరావు తెలిపారు. అదేవిధంగా జీసీసీ క్లబ్​లోని వివిధ సభ్యులు మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో తిరిగి అందరికీ ఆరోగ్యం, వ్యాయామం పట్ల అవగాహన కలిగించేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించామన్నారు. స్వాతంత్ర్య స్ఫూర్తి, జెండాలో ఉన్న మూడు రంగుల ఉద్దేశాన్ని తెలియజేయడానికి  ఈ రైడ్ చేపట్టామని తెలిపారు. ప్రతి ఆదివారం సైక్లింగ్ చేపట్టి వివిధ సేవ కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. వ్యాయామం దినచర్యలో భాగం కావాలని.. దీని కోసం అవగాహన కల్పించడానికి సైకిల్ రైడ్ ఎంతో ఉపయోగపడుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్వాతంత్ర్య భారత్​కు జై అంటూ ఉత్సాహంగా సైకిల్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details