ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Gudimetla Ycp Sarpanch Resigned To Ycp

ETV Bharat / videos

Gudimetla YCP Sarpanch Resigned To Party: సమస్యలను పెద్దలు పట్టించుకోవడం లేదు.. వైసీపీకి సర్పంచ్​ రాజీనామా..! - వైసీపీకి గుడిమెట్ల సర్పంచ్ రాజీనామా

By

Published : Aug 2, 2023, 5:17 PM IST

Sarpanch Resigned To Ycp In Gudimetla: ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం గుడిమెట్ల గ్రామ సర్పంచ్ ఆల సైదమ్మ.. అధికార వైయస్సార్ కాంగ్రెస్​​ పార్టీకీ రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే తన సర్పంచ్​ పదవికి కూడా రాజీనామా చేయనున్నట్లు ఆమె తెలిపారు. గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు  పంచాయతీలో నిధులు లేకపోవడం వల్ల గుడిమెట్లకు ఏ పనులు చేయలేని దుస్థితిలో తాను ఉన్నట్లు ఆమె వాపోయారు. వారం రోజులుగా తమ గ్రామానికి తాగునీరు సరఫరా కావడం లేదని ఆమె తెలిపారు. తమ గ్రామంలో ఏర్పడిన తాగునీటి సమస్యను గురించి ఎన్నోసార్లు ఎమ్మెల్యే జగన్‌మోహన్‌రావు, ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్‌లకు తెలియజేశామని ఆమె అన్నారు. తమ సమస్య గురించి వారికి ఎంత చెప్పినా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అసలు పట్టించుకోవడం లేదని సైదమ్మ ఆరోపించారు. అందుకే  సర్పంచ్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు సైదమ్మ తెలిపారు. ఈ విషయమై సంబంధిత శాఖాధికారులను కూడా కలిశామన్నారు. కానీ వారు కూడా తమ సమస్యపై స్పందించడం లేదని సైదమ్మ ఆరోపించారు.  

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details