ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Group 1 Winner Suvarna

ETV Bharat / videos

Group 1 Winner Suvarna : నాన్న ప్రోత్సాహమే నన్ను నడిపించింది.. : రెండు సార్లు గ్రూప్ 1 ర్యాంక్ సాధించిన సువర్ణ - APPSC

By

Published : Aug 22, 2023, 1:44 PM IST

Group 1 Winner Suvarna Interview : కుమార్తెను కలెక్టర్‌గా చూడాలనేది ఆ యువతి తండ్రి కల. తండ్రి కలను సాకారం చేసేందుకు నిరంతరం శ్రమించింది. ఈ క్రమంలో ఏపీపీఎస్సీ (APPSC) గ్రూప్‌-1 ఫలితాల్లో ప్రతిభ చూపి డిప్యూటీ కలెక్టర్‌ ఉద్యోగానికి ఎంపికైంది. ఆమే.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన పరపటి సువర్ణ. 2022 గ్రూప్‌-1 ఫలితాల్లోనే సత్తాచాటిన యువతి.. డీఎంహెచ్ఓ ఆఫీస్​లో అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా పనిచేస్తున్నారు. మొదటి సారి విజయం సాధించిన ఆమె.. తన తాత కోరిక మేరకు స్థానికంగా అడ్మినిస్ట్రేటివ్ అధికారి ఛాయిస్ తీసుకున్నారు. తిరిగి తండ్రి కల నెరవేర్చడానికి పట్టుదలతో మరోసారి ప్రయత్నించారు. తండ్రి ప్రోత్సాహం వల్లే తాను ఈ విజయం సాధించగలిగానని సువర్ణ తెలిపారు. తాజాగా ప్రకటించిన గ్రూప్‌-1 ఫలితాల్లో సువర్ణ ప్రతిభ చూపి రికార్డు సృష్టించింది. గ్రూప్‌-1లో వరుసగా 2సార్లు సత్తా చాటిన సువర్ణ.. సివిల్స్‌లోనూ  రాణించడమే లక్ష్యం అని చెప్తోంది. గ్రూప్‌-1లో రాణించడానికి ఎలాంటి మెళకువలు పాటించింది? డిప్యూటీ కలెక్టర్‌గా ఎలాంటి  సేవలందించనుంది? అనే విషయాలను సువర్ణ మాట్లల్లోనే విందాం.

ABOUT THE AUTHOR

...view details