ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Simhachalam temple

ETV Bharat / videos

వైభవంగా సింహాద్రి అప్పన్న పెళ్లి చూపుల మహోత్సవం - Sri Paidithalli Ammavari Temple

By

Published : Mar 8, 2023, 1:55 PM IST

సింహాచలం శ్రీవరలక్ష్మీనృసింహస్వామివారి డోలోత్సవం వైభవంగా జరిగింది.. ప్రతి ఏటా పాల్గుణ పౌర్ణమి రోజున జరిగే ఈ ఉత్సవాన్ని బొట్టే నడిగే పౌర్ణమిగా వర్ణిస్తారు. ఈ ఉత్సవంలో బాగంగా స్వామివారిని వేకువజామున సుప్రభాత సేవతో మెల్కొలిపి పవిత్ర గంగాధార జలాలతో అభిషేకించి నిత్యారాధనలు నిర్వహిస్తారు. అనంతరం స్వామివారిని మెట్ల మార్గంలో కొండదిగువకు పల్లకిలో తీసుకువస్తారు. ఏప్రిల్ 1 వ తేదీన జరిగే స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా అప్పన్న సోదరి శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయానికి వెళ్లి పిల్లనిచ్చి వివాహం జరిపించమని అడిగే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అనంతరం స్వామివారు ఆనందంతో పుష్కరిణి సత్రం ఉద్యాన మండపానికి వచ్చి వసంతోత్సవం జరుపుకొంటారు. దీనిలో భాగంగా స్వామివారికి విశ్వక్షేణ ఆరాధన, పుణ్యాహవచనం నిర్వహించి, డోలికల్లో ఊయల సేవ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం అనంతరం వైదీకులు, గ్రామ ప్రజలు, భక్తులు రంగులు చల్లుకుని వసంతోత్సవం జరుపుకొంటారు. అనంతరం పురవీధుల్లో స్వామివారి తిరువీధి సేవ నిర్వహించి.. పెళ్లి కుమారుని అవతారంలో బుగ్గన చుక్క పెట్టుకొని భక్తులకు దర్శనమిస్తారు స్వామివారు. ఏప్రిల్ ఒకటిన స్వామివారి వార్షిక కళ్యాణం అంగరంగగా వైభవంగా నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details