Grand celebrations of Palapolamma Thalli :ఘనంగా గ్రామ దేవత పాలపోలమ్మ తల్లి ఘటాల సంబరాలు - పాలపోలమ్మ తల్లి సంబరాలు ప్రారంభం
Grand celebrations of Palapolamma Thalli : గ్రామ దేవత పాలపోలమ్మ తల్లి ఘటాల సంబరాలు భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మంగళవారం సాయంత్రం ఆముదాలవలసలోని ఐజేనాయుడు కాలనీ వాసులు గ్రామ దేవత పాలపోలమ్మ తల్లి ఘటాల సంబరాలను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకొన్నారు. ప్రతి ఐదేళ్లకోసారి జరిపే పాలపోలమ్మ తల్లి ఘటాల పండుగలో కాలనీవాసులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులు పాలపోలమ్మ తల్లి ఆలయానికి చేరుకొని పూజలు నిర్వహించారు. అంతకుముందు కాలనీ నుంచి ఘటాలను పూజించి తల్లి నామస్మరణ చేస్తూ మంగళ వాయిద్యాలతో ఆలయానికి తరలివెళ్లారు. పాలపోలమ్మ ఆలయానికి చేరుకొని తల్లిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు భారీ సంఖ్యలో మురాట్లు సమర్పించారు. ఈ ఘటాల పండుగ సందర్భంగా కాలనీవాసులు వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు తరలి రావడంతో ఐజే నాయుడు కాలనీ పండగ వాతావరణం సంతరించుకుంది. అలాగే ఘటాల పండగను ప్రశాంత వాతావరణంలో జరగడానికి ఎస్సై వై కృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఘటాల పండుగ నిర్వహణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.