సంక్రాంతికి ముందే ప్రారంభమైన పశువుల పండుగ - తిలకించేందుకు పోటెత్తిన జనం - Jallikattu in AP
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 1, 2024, 8:22 PM IST
Grand Cattle Festival Celebrations in Tirupati District:తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో పక్షం రోజుల ముందే సంక్రాంతి శోభ వచ్చింది. కొత్తశానంబట్లలో పశువుల పండుగ వేడుకలు వైభవంగా నిర్వహించారు. పశువుల యజమానులు ముందుగా గ్రామ దేవతకు పూజలు చేసి కోడెగిత్తలకు, అవులకు, దూడల కొమ్ములకు రంగులు వేసి కొప్పులు తొడిగారు. తమ అభిమాన దేవుళ్ల చిత్ర పటాలతో పాటు జాతీయ జెండాను, రాజకీయ నాయకుల, సినీనటుల ఫొటోలతో కూడిన రంగు రంగు కాగితాలు అంటించిన చెక్క పలకలను కొమ్ములకు కట్టారు. మధ్యాహ్నం భోజన విరామమం అనంతరం వీధిలో పశువులను గుంపులు, గుంపులుగా వదిలారు. అల్లి అవతల నిలబడిన యువకులు జోరుగా వచ్చే ఎద్దులను నిలువరించేందుకు పోటీపడ్డారు. కొమ్ములకు అంటించిన చెక్కపలకలను సొంతం చేసుకొనేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ క్రమంలో కొందరు యువకులకు గాయాలయ్యాయి. ఈ పశువుల పండుగను చూడడానికి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అనేక ప్రాంతాలను నుంచి యువకులు భారీగా తరలి రావడంతో ఆ గ్రామంలో సందడి నెలకొంది.