ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Government_Official_Demands_Bribe_in_Annamayya_District

ETV Bharat / videos

లంచం ఇస్తేనే వైసీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు- రెడ్ హ్యాండెడ్​గా ఏసీబీకి పట్టించిన లబ్దిదారు - Arrests of ACB officials in AP

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 14, 2023, 8:18 PM IST

Government Official Demands Bribe in Annamayya District :వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకి కాకుండా వాలంటీర్ల ద్వారా కేవలం వైసీపీ కార్యకర్తలకే ఇస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. కానీసం ఏదో విధంగా అందిన పథకాలను సైతం ప్రజలకు ఇవ్వకుండా సచివాలయ అధికారులే లంచం అడగటం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. తాజాగా సంక్షేమ పథకాలు మంజూరు చేయించడాకి లంచం అడిగిన సచివాలయ వెల్ఫేర్ సెక్రటరీని ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకోవటం అన్నమయ్య జిల్లాలో కలకలం రేపుతుంది. జిల్లాలోని మదనపల్లి మండలం కోళ్ల బైలులోని సచివాలయం-2 లో కుమార్ వెల్ఫేర్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నాడు. స్థానికంగా ఉండే ఒక లబ్ధిదారుడు తన కుంటుంబానికి నేతన్న నేస్తం, జగనన్న చేయూత రావడం లేదని వెల్ఫేర్ సెక్రటరీకి ఫిర్యాదు చేశాడు.

దీనికి అతడు ఆ పథకాలు రావలంటే అందులో తనకు రూ.9000 ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లబ్ధిదారుడు చేసేదేమిలేక రూ.5000 మాత్రమే ఇవ్వగలనని మెుదట ఒప్పందం కుదుర్చుకున్నాడు. అనుకున్న విధంగానే లబ్ధిదారునికి పథకాలు మంజూరయ్యాయి. దీంతో వెల్ఫేర్ సెక్రెటరీ డబ్బు ఇవ్వలని లబ్ధిదారునిపై ఒత్తిడి తెచ్చాడు. బాధితుడు వెంటనే ఈ విషయంపై ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఏసీబీ డీఎస్పీ జెస్సి ప్రశాంతి మదనపల్లికి వచ్చి బాధితుడు డబ్బులు ఇస్తుండగా నిందితుడు కుమారును రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. అతని వద్ద నుంచి రూ. 5000 నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్య తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details