ఆంధ్రప్రదేశ్

andhra pradesh

http://10.10.50.85:6060///finalout4/andhra-pradesh-nle/finalout/24-June-2023/18835359_ap.jpg

ETV Bharat / videos

New SubDistricts: కొత్త సబ్‌ డిస్ట్రిక్ట్‌లను ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్‌ జారీ - news New SubDistricts

By

Published : Jun 24, 2023, 3:55 PM IST

New SubDistricts in AP: భూముల రీసర్వే అనంతరం పాలనా, పౌరసేవలు అందిచేందుకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వేగంగా చేపట్టేలా కొత్తగా సబ్ డిస్ట్రిక్ట్ లను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అనకాపల్లి, చిత్తూరు, కృష్ణా, పార్వతీపురం మన్యం, నెల్లూరు, శ్రీకాకుళం, తిరుపతి, విజయనగరం, కడప, కోనసీమ, ఏలూరు,కర్నూలు, తూర్పుగోదావరి జిల్లాల్లో సబ్ డిస్ట్రిక్ట్​ల ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ తరపున నోటిఫికేషన్ జారీ చేశారు.

  కొత్తగా ఏర్పాటు చేసిన సబ్ డిస్ట్రిక్ట్​లలో జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఏర్పాటు అవుతాయని ప్రభుత్వం వెలువరించిన నోటిఫికేషన్​లో పేర్కోంది. అలాగే కొత్త సబ్ డిస్ట్రిక్ట్ లలోని రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిని కూడా పేర్కోంటూ ఉత్తర్వులు జారీ చేశారు. రిజిస్ట్రేషన్ల చట్టం 1908లోని సెక్షన్ 5 ప్రకారం ఈ కొత్త సబ్ డిస్ట్రిక్ట్​లను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం నోటిఫికేషన్ లో పేర్కోంది. ప్రభుత్వం నోటిఫికేషన్​లో పేర్కోన్న గ్రామాలు ఇక నుంచి కొత్ సబ్ డిస్ట్రిక్ట్​ల పరిధిలోకి వస్తాయని నోటిఫికేషన్​లో సూచించింది. రిజిస్ట్రేషన్ల సేవల కోసం గ్రామ సచివాలయాల పరిధినీ పేర్కోంటూ సీఎస్ స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ తరపున నోటిఫికేషన్ ఇచ్చారు. తక్షణమే ఈ నోటిఫికేషన్ అమల్లోకి వస్తుందని ప్రభుత్వం పేర్కోంది.

ABOUT THE AUTHOR

...view details