ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Goods_Train_Hits_Car_in_Visakha

ETV Bharat / videos

Goods Train Hits Car in Visakha: విశాఖ రైల్వే లూప్‌లైన్‌లో కారును ఢీకొన్న గూడ్స్‌.. ప్రయాణికులు సేఫ్ - విశాఖ లేటెస్ట్ న్యూస్

By

Published : Aug 9, 2023, 1:30 PM IST

Goods Train Hits Car in Visakha: విశాఖ-షీలా నగర్ పోర్ట్ రోడ్డు మారుతి సర్కిల్ వద్ద అర్ధరాత్రి ఘోర ప్రమాదం తప్పింది. పోర్టు నుంచి స్థానిక వేర్ హౌజ్​లకు వెళ్లే రైల్వే లూప్ లైన్​పై గూడ్స్ రైలు.. కారును ఢీకొట్టింది. స్థానిక శ్రీహరిపురం నుంచి విశాఖ సిటీకి నలుగురు కుటుంబ సభ్యులు కారులో వెళ్లే క్రమంలో.. రైల్వే లైన్​ను క్రాస్ చేస్తుండగా.. ట్రాక్ మధ్యలో కారు ఆగిపోయింది. అదే సమయంలో ట్రాక్​పై వస్తున్న గూడ్స్​ ట్రైన్​ను లోకో పైలెట్ స్లో చేశాడు. దీంతో రైలు.. కారును ఢీకొట్టేలోపు వాహనంలోని ప్రయాణికులు డోర్​లు తెరచి బయటకు దూకి వచ్చేశారు. వారు స్వల్ప గాయాలతో ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. దీనిపై సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో బాధితులు రిటైర్డ్ నేవీ అధికారి కుటుంబంగా గుర్తించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన గాజువాక పోలీసులు దర్యాప్తు చేపట్టారు.   

ABOUT THE AUTHOR

...view details