Gold Appraiser Cheating: గ్రామీణ బ్యాంక్లో గోల్డ్ అప్రైజర్ మోసం..రూ.2 కోట్ల విలువైన బంగారంతో పరారీ - పల్నాడు జిల్లాలో బంగారం దొంగతనం
Gold Appraiser Cheating: పల్నాడు జిల్లా క్రోసూరు మండలం దొడ్లేరు లోని చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్లో గోల్డ్ అప్రైజర్ తన చేతివాటం ప్రదర్శించాడు. ఖాతాదారులు లోన్ తీసుకునే సమయంలో ఇచ్చిన సుమారు రూ. రెండు కోట్లు విలువ చేసే బంగారంతో నాగార్జున అనే గోల్డ్ అప్రైజర్ పరారయ్యాడు. తమ బంగారంతో గోల్డ్ అప్రైజర్ పారిపోయిన విషయం తెలుసుకున్న ఖాతాదారులు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు వద్దకు వచ్చి ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో ఇద్దరు మహిళ ఖాతాదారులు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ వద్ద సొమ్మ సిల్లి పడిపోయారు. అలాగే బంగారం తాకట్టు పెట్టే సమయంలో ఏయే వస్తువులు పెట్టామన్నది గోల్డ్ అప్రైజర్ నాగార్జున నమోదు చేసుకోలేదని బాధితులు తెలిపారు. తాకట్టు పెట్టినప్పుడు ఇవ్వవలసిన రశీదు కూడా రెండు రోజుల తర్వాత ఇచ్చారని వారు పేర్కొన్నారు. ఘటనపై సమాచారం అందుకున్న చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ ఉన్నత అధికారులు.. .. విచారణ జరుపుతున్నారు.