దాస సాహిత్య ఆధ్వర్యంలో గోదావరి మాతకు హారతి - గోదావరి హారతి
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 21, 2023, 10:43 AM IST
Dasa Sahitya Under Godavari Harathi In Kovvuru:తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలంలో తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో వేదపండితులు గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ పాల్గొన్నారు. వారికి వేద పండితులు పసుపు కుంకుమలను ఇచ్చి పూజ చేయించారు.తానేటి వనిత, భరత్ రామ్ గోదావరి మాతకు హారతి ఇచ్చారు. అనంతరం పండితులు తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు. ఉభయ గోదావరి జిల్లాల నుంచి గోదావరి హారతిని విక్షించడానికి భక్తులు తరలివచ్చారు. ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా భక్తులతో కిటకిటలాడింది. భజన, కోలాటం, భక్త బృందాల సంకీర్తనల నడుమ గోదావరి మాతకు మహా పూజ, కలసపూజ, శోషాచర పూజలు పండితులు నిర్వహించారు. మంగళ శాసనం, మంత్రపుష్పం, వేద స్వస్తి, ప్రసాద వితరణ పూజా కార్యక్రమాలను శాస్త్రక్తంగా పూర్తి చేశారు. సంకీర్తనలతో ప్రారంభమై మహా హారతితో ముగిసిన ఈ సంప్రదాయ కార్యక్రమంలో ఆనంద తీర్థ చార్యులు ప్రసంగించారు. హిందూ ధర్మ పరిరక్షణ సంకల్పంతో దాస సాహిత్య ప్రాజెక్ట్ ఏర్పాటు అయిందన్నారు. గోదావరికి కుంభ, నక్షత్ర, కర్పూర, నాగ హారతులు ఉత్సవ మూర్తికి మంగళహారతి, మహానీరాజనం శాస్త్రక్తంగా సమర్పించారు.