Godavari Flood Victims Problems: కట్టుబట్టలతో ఊరొదిలిపోయిన వరద బాధితులు.. పునరావాస కేంద్రంలో వారం రోజులుగా కష్టాలు - వరద ముంపు బాధితులు
Godavari Flood Victims Problems: వరద వచ్చిన ప్రతి సారి.. కట్టుబట్టలతో బయటకు రావాల్సిన పరిస్థితి వారిది. ఏళ్లు గడుస్తున్నా.. తమను పట్టించుకునే నాథుడే కరువయ్యారని వారంతా వాపోతున్నారు. అల్లూరి జిల్లాలోని కోతులగుట్ట పునరావాస కేంద్రంలో కూనవరం వరద ముంపు బాధితులు తీవ్ర కష్టాలు పడుతున్నారు. గడిచిన వారం రోజుల నుంచి పునరావాస కేంద్రంలో కట్టు బట్టలతో తలదాచుకుంటున్నారు. ప్రతి ఏడాది వరదలకు ఇదే నరకం అనుభవిస్తున్నామని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలవరం విషయంలో పరిహారం ఇస్తామంటున్న ప్రభుత్వం.. ఏళ్లు గడుస్తున్నా ఇవ్వడం లేదని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. గత ఏడాది కూడా కేవలం రెండు వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని.. ఈ ఏడాది కూడా వరద వచ్చి బురదమయం అయితే ప్రభుత్వం పట్టించుకోలేదని భాదపడుతున్నారు. కనీసం ఇప్పుడైనా ఇళ్లను శుభ్రపరుచుకోవడానికి కనీసం 20 వేలు ఇవ్వాలని మొర పెట్టుకుంటున్నారు. అల్లూరి జిల్లా కోతులగిట్ట గిరిజన బాలికల హాస్టల్లో తలదాచుకుంటున్న బాధితుల పరిస్థితి మా ప్రతినిధి ఆదిత్య పవన్ అందిస్తారు.