GGH Superintendent Fire on Hospital Staff: జీజీహెచ్లో సిబ్బంది నిర్లక్ష్యం.. సూపరింటెండెంట్ ఆగ్రహం - Tests in GGH
GGH Superintendent Fire on Hospital Staff :గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో పోస్ట్ క్యాథ్ ల్యాబ్, వార్డుల్లో రోగులకు సరైన వైద్య సేవలు అందడం లేదని.. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ సిబ్బందిపై మండిపడ్డారు. ఆసుపత్రిలో అన్ని సదుపాయాలు ఉన్నప్పటికీ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఈసీజీ, గుండె స్కానింగ్ మిషన్లు, అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం పోస్ట్ క్యాథ్ ల్యాబ్, వార్డును పరిశీలించిన కిరణ్ కుమార్.. ఆసుపత్రిలో అన్నీ సదుపాయాలు కల్పిస్తున్నా.. సిబ్బంది మాత్రం ఇల్లరికం వచ్చిన అల్లుడు మాదిరిగా పని చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. రోగులకు ఉత్తమ సేవలు అందించేందుకు లక్ష్మీ ఆరుష్ హెల్త్ కేర్ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని, కానీ ఇక్కడ చూస్తే కనీస సదుపాయాలు లేవని ఆయన మండిపడ్డారు. వెంటనే ఈసీజీ మిషన్లు, గుండె స్కానింగ్ మిషన్లు అందుబాటులో ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. ఆక్సిజన్ ఫ్లో మీటర్స్, డిఫిబ్రలేటర్, అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు.