Gautam Adani meet With CM Jagan: సీఎం జగన్‌తో గౌతమ్ అదానీ భేటీ.. - Cm jagan news
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 28, 2023, 9:29 PM IST
Gautam Adani meet With CM Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో అదానీ గ్రూపు సంస్థల అధినేత గౌతమ్ అదానీ ప్రత్యేక భేటీ అయ్యారు. భేటీలో భాగంగా సీఎం జగన్‌తో గౌతమ్ అదానీ పలు కీలక అంశాలపై చర్చిస్తోన్నారు. భేటీ అనంతరం సీఎం జగన్‌తో కలిసి గౌతమ్ అదానీ డిన్నర్ చేయనున్నారు.
Gautam Adani meet CM Jagan in Tadepalli:తాడేపల్లిలోసీఎం జగన్‌తో గౌతమ్ అదానీ ప్రత్యేక భేటీ అయ్యారు. భేటీకి ముందు ఆయన (అదానీ) అహ్మదాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు చేరుకున్నారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తాడేపల్లిలోని సీఎం నివాసానికి వెళ్లారు. జగన్‌తో భేటీలో అదానీ.. పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. చర్చల అనంతరం సీఎం జగన్‌తో కలిసి డిన్నర్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో అదానీతో సీఎం భేటీ, డిన్నర్ ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాకుండా, అదానీ వ్యాపార సంబంధ వ్యవహారాలపై మాట్లాడేందుకు వచ్చారా..?, లేక వ్యక్తిగత విషయాలపై చర్చించడానికి వచ్చారా..? అన్న అంశాలు అటు సోషల్ మీడియాలోనూ, ఇటు రాష్ట్ర ప్రజల్లో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.