ఆంధ్రప్రదేశ్

andhra pradesh

gaurasandram_maremma_festival

ETV Bharat / videos

Gaurasandram Maremma Festival : గౌరసంద్రం మారెమ్మ ఉత్సవాలు.. పూజారి విన్యాసాలు చూస్తే వణుకే..! - Anantapuram District

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 28, 2023, 2:03 PM IST

Gaurasandram Maremma Festivals in Anantapur District : అనంతపురం జిల్లాలో గౌరసంద్రం మారెమ్మ ఉత్సవాలు కనుల పండువగా జరిగాయి. బెలుగుప్ప తాండలో గౌరసంద్రం మారెమ్మ ఉత్సవాలు రెండు రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. ముళ్లపొదలపై పూజారి నడిచే విన్యాసాలు అందరినీ అబ్బుపరిచాయి. గౌరసంద్రం మారెమ్మ దేవత ఉత్సవాలలో భాగంగా అనంతపురం జిల్లా బెలుగుప్ప తాండలో రెండు రోజుల పాటు ప్రత్యేక పూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ప్రతిమను ఊరేగించారు. 

ఆలయ పూజారి చంద్రునాయక్ ముళ్లపొదలపై నడుస్తూ చేసిన విన్యాసాలు అందరినీ అబ్బుపరిచాయి. అనంతరం సిడిమానోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలలో చివరి రోజు కావడంతో ఆలయం వద్ద గ్రామస్థులు పెద్ద ఎత్తున పూజలను చేపట్టారు. అమ్మవారి ప్రతిమను ఊరేగించారు. ఆలయ పూజారి చంద్రునాయక్ ను సిడిమానుకు కట్టి చుట్టూ ప్రదర్శనలు చేశారు. ఉత్సవాల నేపథ్యంలో కమిటీ ఆధ్వర్యాన ఏర్పాట్లు చేశారు. అమ్మవారిని దర్శించుకునేందుకు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

ABOUT THE AUTHOR

...view details