ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

వీడెవడండీ బాబూ.. గణపతి మండపాన్నీ వదలలేదు - ganesha neck

By

Published : Sep 2, 2022, 5:42 PM IST

Updated : Feb 3, 2023, 8:27 PM IST

Theft: తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా కోహెడలో వినాయకుడి మెడలో డబ్బుల దండ అపహరణకు గురైంది. నవరాత్రులలో భాగంగా పోచమ్మ గుడి ఆవరణలో ఏర్పాటు చేసిన గణపతికి మెుదటిరోజు భక్తులు కరెన్సీ దండ వేసి తమ భక్తిని చాటుకున్నారు. రాత్రి పూజల తరువాత అందరూ వెళ్లిపోయారు. ఉదయం వచ్చి చూడగా ఆ దండ మాయమైంది. నిర్వాహకులు సీసీ కెమెరాను పరిశీలించగా.. గుర్తు తెలియని యువకుడు గణపతి మెడలో నుంచి డబ్బుల దండ దొంగిలించిన దృశ్యాలు కనిపించాయి. యువకుడు సమీప గ్రామమైన వింజపల్లి వాసిగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చోరీ విషయమై స్థానిక పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST

ABOUT THE AUTHOR

...view details