సమాజాన్ని ముందుకు నడిపించే దిక్సూచి గరికపాటి : రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్ వి సుబ్రహ్మణ్యం - గరికపాటి నరసింహారావు ప్రవచనాలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 15, 2023, 1:30 PM IST
Garikapati Narasimha Rao Honored : పద్మశ్రీ అవార్డు గ్రహీత, మహా సహస్రావధాని, ప్రవచన కర్త గరికపాటి నరసింహారావు ప్రవచనాలు సమాజానికి మేలు చేసే గొప్ప గుళికలని.. రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం కొనియాడారు. విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ కళాభారతి ఆధ్వర్యంలో.. గరికపాటికి ఘన సత్కారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎల్వీ సుబ్రహ్మణ్యం హాజరయ్యారు. గరికపాటిని సత్కరించి ఆయన గొప్పతనాన్ని కొనియాడారు. గరికపాటి ప్రవచనాలు సమాజాన్ని మేలుకొలిపే విధంగా ఉంటాయని పేర్కొన్నారు. అంతేకాకుండా గరికపాటి లాంటి వారు సమాజాన్ని ముందుకు నడిపించే దిక్సూచి అని అన్నారు.
తెలుగు, సంస్కృత సాహిత్యానికి ఉన్న అవినాభావ సంబంధాన్ని ప్రజలకు తెలియజేసేందుకు గరికిపాటి లాంటి వారు ఉన్నారని పేర్కొన్నారు. ప్రజలకు తెలుగు సాహిత్యంపై ఆసక్తిని పెంచడానికి వీరంతా కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ కార్యదర్శి రాంబాబు ఇతర ప్రముఖులు పాల్గొని.. గరికపాటిని సత్కరించారు.