ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Garbage_Dumping_Yard_in_Center_of_the_Ongole

ETV Bharat / videos

Garbage Dumping Yard in Center of the Ongole: నగరం నడిబొడ్డున డంపింగ్​ యార్డు.. శుక్రవారంలోపు తొలగించాలని వ్యాపారుల హెచ్చరిక!

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 23, 2023, 9:16 AM IST

Garbage Dumping Yard in Center of the Ongole :చెత్త వల్ల ప్రజలు అనారోగ్యం పాలవుతారని.. దాన్ని సేకరించి ఊరి చివర డంపిగ్‌ యార్డులో వేయడం మనకు తెలుసు. కానీ ఒంగోలులో మాత్రం ప్రజలు ఆరోగ్యాన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా ఏకంగా డంపింగ్‌ యార్డునే నగరం నడిబొడ్డులో ఏర్పాటు చేశారు. అదీ నిత్యం జన సంచారం ఉండే మార్కెట్‌లకు దగ్గర్లోనే పెట్టడం మరింత ఆందోళన కలిగిస్తోంది. 

Traders Agitation for Removing the Dumping Yard :ప్రకాశం జిల్లా ఒంగోలులోని చేపలు, కూరగాయల మార్కెట్‌కు మధ్యలో ఉన్న రోడ్డు, పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో డంపింగ్‌ యార్డు ఏర్పాటు చేశారు. చెత్తంతా తీసుకొచ్చి ఆ డంపింగ్ యార్డులో పోసి.. అక్కడ నుంచి తీరికగా నగర శివారుకు తరలిస్తున్నారు. అయితే కొంతకాలంగా చెత్తంతా ఈ డంపింగ్‌ యార్డులోనే వదిలేస్తున్నారు. దీంతో మార్కెట్‌కి వచ్చేవారు దుర్వాసనతో నానా అవస్థలు పడుతున్నారు. వ్యాపారులు దుర్వాసనను తట్టుకోలేక అనారోగ్యం పాలవుతున్నారు. దీంతో వ్యాపారులు ఆగ్రహంతో చెత్త బళ్లను అడ్డుకున్నారు. 

డంపింగ్‌ యార్డు వల్ల చేపల మార్కెట్‌లోని మురుగు నీటి కాలువల్లో చెత్త పేరుకు పోయి నీళ్లు బయటకు వెళ్లట్లేదని వ్యాపారులు మండిపడ్డారు. చెత్త తొలగించే వరకు వెనక్కి తగ్గబోమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లులు రాకపోవడం వల్లే ఎక్కడి పనులు అక్కడ నిలిపివేశామని గుత్తేదారులు అంటున్నారు. అప్పులు చేసి తాము ఎన్ని పనులు చేయగలమని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే శుక్రవారం లోపు డంపింగ్ యార్డుని తొలగించకపోతే ఊరుకొనేదే లేదంటూ వ్యాపారులు హెచ్చరించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details