Ganta Srinivasa Rao Signature Collection Program: జగనకు ఇవే చివరి ఎన్నికలు.. చంద్రబాబును అరెస్టు చేసి పెద్ద తప్పు చేశారు: గంటా - సంతకాల సేకరణ కార్యక్రమం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 14, 2023, 3:37 PM IST
Ganta Srinivasa Rao Signature Collection Program: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్టు ప్రక్రియ ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్తుకు తానే సమాధి కట్టుకున్నారని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం రాజకీయ కక్షతోనే బాబు అరెస్టు చేశారని గంటా మండిపడ్డారు. జగన్ మోహన్ రెడ్డి 16 నెలలు జైలులో ఉన్నాడు కాబట్టి చంద్రబాబును కూడా ఒక్కరోజైనా జైల్లో పెట్టించాలనే దురుద్దేశంతో ఇలాంటి తప్పుడు కేసులు పెట్టారని అన్నారు. అవినీతిపరులు, అరాచకవాదులు అందలమెక్కి రాజ్యమేలుతుంటే.. నీతిమంతులు జైల్లో మగ్గుతున్నారని గంటా వెల్లడించారు. చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ గంటా శ్రీనివాసరావు ఇంటి ఎదుట బాబుతో మేమున్నామంటూ సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా చంద్రబాబు నాయుడు త్వరలోనే కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.