Ganta Srinivasa Rao Comments : చిరంజీవి మాట్లాడారంటే రాష్ట్ర పరిస్థితేంటో అర్థం చేసుకోవలి గంటా.. - tollywood industry
Ganta Srinivasa Rao Responded on Chiranjeevi Comments : విమర్శలకు, వివాదాలకు దూరంగా ఉండే అందరివాడు చిరంజీవి అని.. ఆయనకు కూడా ఇబ్బంది కలిగేలా కొంతమంది మాట్లాడారంటే.. రాష్ట్రం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో అర్థం చేసుకోవాలని తెలుగుదేశం సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు అన్నారు. చిరంజీవి చెప్పిన విషయంలో తప్పేమి లేదని.. ప్రభుత్వానికి ఒక సలహా మాత్రమే ఇచ్చారన్నారు. వైసీపీ నాయకులు ప్రత్యేక హోదా, రోడ్ల నిర్మాణం, ప్రాజెక్టులు, పేదవాడి కడుపు నింపే ఉద్యోగ ఉపాధి కల్పన గురించి ఆలోచించి రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలన్నారని.. అలా కాకుండా పిచ్చుక పై బ్రహ్మాస్త్రం లాగా ఇండస్ట్రీ మీద పడతారేంటని వ్యాఖ్యానించినట్లు పేర్కొన్నారు. ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తే ప్రభుత్వాలను గుండెల్లో పెట్టుకుంటారనడంలో తప్పేముందని ప్రశ్నించారు. ఆయన చెప్పిన వాస్తవాలను పరిగణనలోకి తీసుకుని అభివృద్ధి వైపు దృష్టి సారించకుండా.. పట్టుమని పది నిముషాలు తమ శాఖలు గురించి మాట్లాడలేని మంత్రులందరూ మీడియా ముందుకు వచ్చి అదేదో బ్రహ్మాండం బద్దలైనట్టు చిరంజీవి గురించి మాట్లాడటం సరికాదని హితవు పలికారు. ఏపీ ప్రభుత్వం సినిమా పరిశ్రమపై కాకుండా ఉద్యోగాలు, పేదలపై దృష్టి సారించాలన్న చిరంజీవి వ్యాఖ్యలను తెలుగు ప్రజలందరూ సమర్థిస్తున్నారన్నారు.