ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Ganta Srinivasa Rao criticises

ETV Bharat / videos

ప్రజలు మార్చాలనుకునేది ఎమ్మెల్యేలను కాదు సీఎం జగన్​నే: గంటా శ్రీనివాసరావు - cm jagan

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 31, 2023, 1:32 PM IST

Ganta Srinivasa Rao Criticises CM Jagan Mohan Reddy:వైఎస్సార్సీపీ నుంచి ఎంతో మంది నేతలు తెలుగుదేశంలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. రోజూ తనను ఆ పార్టీ నేతలు ఫోన్లలో సంప్రదిస్తున్నట్లు చెప్పారు. త్వరలో ఓ సంచలన వార్తతో ముందుకు వస్తారన్నారు. సీఎం వైఖరిపై వంశీ, సీతంరాజు, అన్నా రాంబాబు, పార్ధసారధితో పాటు ఎంతో మంది అసంతృప్తితో రగిలిపోతున్నారన్నారు. జగనన్న వదిలిన బాణంగా చెప్పే షర్మిల ఎక్కడ ఉందో అంటూ ఎద్దేవా చేశారు. ఈ రాష్ట్ర ప్రజలు మార్చాలనుకునేది ఎమ్మెల్యేలను కాదని, సీఎం జగన్​నే మార్చాలనుకుంటున్నారని గంటా విమర్శించారు. జగన్‌ ఎన్ని జిమ్మిక్కులు చేసినా, 2024లో తెలుగుదేశం, జనసేన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని స్పష్టం చేశారు. 

సీఎం జగన్ గతంలో తన పాదయాత్రలో నవరత్నాలు, మేనిఫెస్టో అంటూ మెుత్తం 739 హామీలు ఇచ్చారని గంటా గుర్తు చేశారు. అయితే, నవరత్నాలు మాత్రమే అమలు చేస్తున్నట్లు చెబుతున్నారని పేర్కొన్నారు. జగన్ గతంలో ఇచ్చిన హామీల్లో  కేవలం 3% మాత్రమే అమలు చేశారన్నారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రం మెడలు వంచుతామన్నారు, వైసీపీ నేతలే కేంద్రం ముందు మెడలు వంచారన్నారని ఎద్దేవా చేశారు.  

ABOUT THE AUTHOR

...view details