ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Ganta

ETV Bharat / videos

Ganta Srinivasa Rao: 'ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీడీపీ సిద్దం' - లోకేష్ యువగలం పాదయాత్ర

By

Published : May 16, 2023, 9:06 PM IST

Ganta Srinivasa Rao Comments on YCP: భానుడి భగభగలలోనూ లోకేశ్ పట్టుదలకు తన యువగళం పాదయాత్ర తొలి వంద రోజులు, 34 నియోజకవర్గాలు విజయవంతంగా పూర్తి చేశారని, రెచ్చగొట్టి అడ్డుకోవాలని చూస్తున్నా సంయమనంగా వ్యవహరిస్తూ, అధికార పార్టీ చేస్తున్న అక్రమాలను ఎండగట్టే యత్నం లోకేశ్​ చేస్తున్నారని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. 

విశాఖలోని ఎండాడలోని గ్రామదేవత ఉత్సవాలకు హాజరైన ఆయన అక్కడ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ, ఇది మూన్నాళ్ల ముచ్చట అని విమర్శించిన వారి నోళ్లు మూతపడేలా అధికార పార్టీ అరాచకాలను ఎక్కడికక్కడ ఎండగడుతూ లోకేశ్​ పాదయాత్ర కొత్త ట్రెండింగ్​గా మారిందన్నారు. ప్రస్తుత పరిపాలనలో జరుగుతున్న అవకతవకలు, గతంలో తాము చేసిన అభివృద్ది ఎక్కడికక్కడ చెప్పడం ద్వారా ఆయన కొత్త ఒరవడి సృష్టించారన్నారు. వైసీపీ ప్రభుత్వానికి కౌంట్​డౌన్ ప్రారంభమైందని, ఎన్నికలు ఎప్పుడు జరిగినా తెలుగుదేశం పార్టీకి పట్టంగట్టడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారన్నారు. 

ప్రస్తుతం ఎదుర్కొంటున్న వ్యతిరేకతను బట్టి వారికి పరిస్ధితి అవగతమవుతోందని, జనవరి నుంచి ఆర్ధిక ఇబ్బందులు మరింతగా ఎక్కువవుతాయనే ముందస్తు ఎన్నికలు వస్తాయని అంచనాలు ఉన్నాయన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీడీపీ సిద్దంగా ఉందని.. ఘన విజయాన్ని సొంతం చేసుకుంటుందని వివరించారు. అలాగే కర్ణాటక ఎన్నికలు వేరు, ఆంధ్రప్రదేశ్ వేరని తెలిపారు. ఇక్కడ కాంగ్రెస్ మళ్లీ పుంజుకుంటుందన్నది కల అని రాష్ట్రంలో నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన పరిస్దితి కాంగ్రెస్ పార్టీదన్నారు. అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు ఇచ్చింది. నాకు ముందస్తు కార్యక్రమాలున్నాయన్న కుంటి సాకులతో ఒక ఎంపీ రాజ్యాంగబద్దంగా ఎన్నికైన వ్యక్తి విచారణను తప్పించుకోవడం తగదని వ్యాఖ్యానించారు. 

ABOUT THE AUTHOR

...view details